Popular Posts

Monday, April 9, 2012

Tulasi Mahatyamu


శ్రీ మహా గణపతయే నమః
శ్రీ సరస్వతయే నమః
శ్రీ పాద వల్లభ నరసింహ  సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః

తులసి మహత్యము

న పశ్యన్తి యమం వైశ్య  తులసీవనరోపనాట్
సర్వపాపహారం సర్వకామదం తులసివనం
తులసివనము గృహమున వేసినవారు యముని , యమదూతలను చూడరు. తులసి వనము సమస్త పాపములను పోగొట్టును.సమస్తమిన కోరికలను ఇచ్చును. 

తులసికాననం వైశ్య గృహే యాత్ర తు తిస్తటి 
తద్గ్రుహం తిర్తభూతం హి న యాంతి యమకిన్కరాహ
ఓ వైశ్య  ఎవని యొక్క గృహమున తులసివనము ఉండునో , ఆ గృహము మిక్కిలి తిర్తభూతమైనది అగును. అచ్చటికి యమకింకరులు రారు.

తావద్వర్శసహస్రాణి  యావద్భీజడాలని  చ
వసంతిదేవలోకేతే  తులసీం  రోపయంతే యే
ఎంతవరకు తులసివనమును నాటుదురో, అందలి వనములు దళములు  మాటిమాటికి పెరుగుచూ యెంత కాలము ఉండునో , అమ్తకాలమూ  దేవలోకమున వారు నివసించుదురు. 

తులసీగంధమాఘ్రాయ  పితరస్తుష్టమానసాహ
ప్రయాన్తి గరుదారూద స్తత్పదం చక్రపానినః
తులసివన గందమును వాసన్ చూచి పితృ దేవతలు సంతోషింతురు. తులసిని నాటినవారు గరత్మన్తుని ఎక్కినవారై , సుదర్శన చక్రమును కలవారై , మహావిష్ణువు రూపము కలవారై, వైకున్తలోకమునకు    వెళ్ళుదురు.

దర్సనం నర్మదాయాస్తూ  గంగాస్నానం విశాం వర
తులసిదల సంస్పర్శహ  సమమేతత్రయం స్మృతం 
నర్మదా  నది దర్శనము, గంగాస్నానము, తులసిదలములను  తాకుత, ఈ మూడును సమానుములైన పుణ్యఫలమును ఇచ్చునవి అగును.

No comments: