శ్రీ మహా గణపతయే నమః
శ్రీ సరస్వతయే నమః
శ్రీ పాద వల్లభ నరసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
తులసి మహత్యము
న పశ్యన్తి యమం వైశ్య తులసీవనరోపనాట్
సర్వపాపహారం సర్వకామదం తులసివనం
తులసివనము గృహమున వేసినవారు యముని , యమదూతలను చూడరు. తులసి వనము సమస్త పాపములను పోగొట్టును.సమస్తమిన కోరికలను ఇచ్చును.
తులసికాననం వైశ్య గృహే యాత్ర తు తిస్తటి
తద్గ్రుహం తిర్తభూతం హి న యాంతి యమకిన్కరాహ
ఓ వైశ్య ఎవని యొక్క గృహమున తులసివనము ఉండునో , ఆ గృహము మిక్కిలి తిర్తభూతమైనది అగును. అచ్చటికి యమకింకరులు రారు.
తావద్వర్శసహస్రాణి యావద్భీజడాలని చ
వసంతిదేవలోకేతే తులసీం రోపయంతే యే
ఎంతవరకు తులసివనమును నాటుదురో, అందలి వనములు దళములు మాటిమాటికి పెరుగుచూ యెంత కాలము ఉండునో , అమ్తకాలమూ దేవలోకమున వారు నివసించుదురు.
తులసీగంధమాఘ్రాయ పితరస్తుష్టమానసాహ
ప్రయాన్తి గరుదారూద స్తత్పదం చక్రపానినః
తులసివన గందమును వాసన్ చూచి పితృ దేవతలు సంతోషింతురు. తులసిని నాటినవారు గరత్మన్తుని ఎక్కినవారై , సుదర్శన చక్రమును కలవారై , మహావిష్ణువు రూపము కలవారై, వైకున్తలోకమునకు వెళ్ళుదురు.
దర్సనం నర్మదాయాస్తూ గంగాస్నానం విశాం వర
తులసిదల సంస్పర్శహ సమమేతత్రయం స్మృతం
నర్మదా నది దర్శనము, గంగాస్నానము, తులసిదలములను తాకుత, ఈ మూడును సమానుములైన పుణ్యఫలమును ఇచ్చునవి అగును.